calender_icon.png 16 November, 2024 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిపై దృష్టి పెట్టండి

20-07-2024 03:09:16 AM

  • ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు
  • కేసీఆర్ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టింది
  • బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగా ల అభివృద్ధిలో పరుగులు పెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనికి తాజాగా నీతిఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) లెక్కలే నిదర్శనమని చెప్పారు. ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టిని రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్‌ను విమర్శించారు. పదేళ్ల పాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.

శుక్రవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మోడల్ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందన్న నీతిఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2020- పోలిస్తే 2023- నాటికి (ఎస్‌డీజీ)లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని చెప్పారు. చాలా రంగాల్లో తెలంగాణ సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమన్నారు. 

మరణశాసనానికి సంబురాలా?

రైతు రుణమాఫీపై కేటీఆర్ తనదైన శైలి లో ట్వీట్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ చేసుకుంటున్న సంబరాలును చారాణ కోడి కి..! బారాణ మసాలా అని అభివర్ణించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అన్నారు. ప్రభు త్వం రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనా లయ్యాయన్నారు. అరులైన లబ్ధిదారులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలంటూ ప్రశ్నించారు.