calender_icon.png 12 March, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి

12-03-2025 01:11:23 AM

నిర్మల్, మార్చి 11 (విజయ క్రాంతి) ః జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మంగళవారం గ్రామీణ పోలీస్ స్టేషన్ తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసి నేరాల రికార్డును అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా మహిళపై జరుగుతున్న దాడులు డిజిటల్ నేరాలు దొంగతనాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాకేష్ మీనా సిఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.