calender_icon.png 30 November, 2024 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటోన్మెంట్ కారుణ్య నియామకాలపై దృష్టి పెట్టండి

15-10-2024 01:34:36 AM

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఎంపీ ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో కారుణ్య నియామకాల విషయాన్ని పరిశీలించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన కలిశారు కంటోన్మెంట్ బోర్డులో గత 15 ఏళ్లుగా కారు ణ్య నియామకాలు జరగడం లేదని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. అనేక కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు.

ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని చాలాకాలంగా బాధిత కు టుంబాలు అభ్యర్థిస్తున్నాయని ఈటల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తమకు మేలు జరుగుతుందని, వారంతా ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. 

ఆఫీసెస్ ప్రాఫిట్ చైర్మన్‌గా ఈటల పదవీ బాధ్యతలు    

పార్లమెంట్‌కు చెందిన జాయింట్  కమి టీ ఆన్ ఆఫీసెస్ ప్రాఫిట్ చైర్మన్‌గా  ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో బా ధ్యతలు స్వీకరించారు. ఈ కమిటీలో చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా... ఇందులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సైతం చోటుదక్కింది. ఇక రాజ్యసభ నుంచి ఈ కమిటీలో 5 మంది సభ్యులున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈటలను తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నాయకులు అభినందించారు.