12-04-2025 10:05:31 PM
బ్రిడ్జ్ కి అంబేద్కర్ పేరును నామకరణం చేయాలి..
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ప్రయాణికుల సౌకర్యార్థం క్యాతన్ పల్లి రైల్వే గేటుపై చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ నెల 15న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదగా క్యాతన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్నట్లు టిపిసిసి సెక్రటరీ రఘునాథరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రారంభం పనులను సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ లు పరిశీలించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రోడ్డు దాటే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా క్యాతన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని పలువురు నాయకులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, పనాస రాజు తదితరులు పాల్గొన్నారు.