ఎస్ఇ మహేందర్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యుత్ లైన్లకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే గాలిపటాలు ఎగరవేయాలని భద్రాది కొత్తగూడెం సర్కిల్, సూపెరింటెండింగ్ ఇంజనీర్ జి.మహేందర్ తెలిపారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో సంక్రాతి పండుగ సందర్భాంగా పిల్లలు, పెద్దలు సంతోషంగా పతంగులు ఎగురవేయడం ఒక సాంప్రదాయకంగా వస్తున్నదని, సురక్షిత ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరమన్నారు. ఒకవేళ విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే ఆ పతంగుల మాంజాలు విద్యుత్ లైన్లపై, ట్రాన్సఫార్మర్లపై పడి ప్రమాదాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగే అవకాశం ఉన్నదని, అందువల్ల విద్యుత్ లైన్లు లేని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఎగరవేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
క్రింద పేర్కొన్న తగిన జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగురవేసి తమ పండుగను మరింత సంతోషమయం చేసుకోగలరని విద్యుత్ వినియోగదారులకు కోరుతున్నాము.
1. ఖాళీ ప్రదేశాల్లో, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు కు దూరంగా మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయండి.
2. విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్సఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయడం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం వున్నది.
3. దారాలతో ఉన్న పతంగులే తప్ప చైనా మాంజాలతో కూడిన వాటిని అస్సలే వాడొద్దు. మాంజాదారం తో ప్రమాదం పొంచి ఉన్నదని కరెంటు తీగలకు తాకితే అస్సలేతెగవు పైగా లైన్లు బ్రేక్ డౌన్ అయ్యే అవకాశముంది మరియు మాంజాదారాలతో పక్షులతో పాటు మనుషులకు కూడా గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. 4. గాలిపటం ఎగురవేస్తూ కరెంటు తీగలకు చుట్టుకుంటే దాన్ని లాగుతూ లేదా కర్ర సహాయంతో లేదా ఇనుప పైపులాంటి వాటితో తొలగించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిల్లో చేయరాదు . .
5. పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడ్డప్పుడు వాటిని వదిలేయండి. ఒక వేళ వాటిని పట్టుకు లాగినప్పుడు విద్యుత్ తీగలు ఒక దానికొకటి రాసుకుని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం వున్నది.
6. బాల్కనీ/ గోడలు, ,ప్రహరీ గోడలేని మేడపై ఉన్న వాటి మీద నుండి పతంగులు ఎగురవేయరాదు. ఇది ప్రమాదకరం. ప్రమాదాలు జరిగే అవకాశం వుంది.
7. తల్లిదండ్రులు తమ పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు తప్పకుండ గమనించగలరు. పిల్లలు తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకనివ్వొద్దు.
ఒకవేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు/మాంజాలు తెగి పడ్డట్లు ఉంటే, విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు వున్నా, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ వారి 1912 టోల్ ఫ్రీ నంబర్ కు గాని లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి తెలుపగలరని వివరించారు. జాగ్రత్తగా పతంగులు ఎగరవేయండి . విద్యుత్ శాఖకు కు సహకరించండి . వినియోగదారుల శ్రేయస్సు కొరకు ఆహర్నిశలు విద్యుత్ శాఖ నిబ్బద్దత్థో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.