22-02-2025 12:09:38 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఫ్లు చికెన్’ గచ్చిబౌలిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫ్లు చికెన్ ఇండియా సీఈవో కుల్‌ప్రీత్ సాహ్ని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఫ్రైడ్ చికెన్ ప్రియుల మన్ననలు పొందిన ఈ బ్రాండ్ నగర ప్రజల హృదయాలను దోచుకుంటుందని పేర్కొన్నారు.
ప్రత్యేకమైన క్రిస్పీ చికెన్, అంతర్జాతీయ స్థాయి మెనూ ద్వారా నగరంలో ఫ్రైడ్ చికెన్ అనుభవాన్ని కొత్తస్థాయికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ ఫ్లు చికెన్ స్కాండినేవియాలో ప్రారంభమై నాణ్యత, అత్యుత్తమ రుచి, క్రంచీ టెక్స్చర్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆహారప్రియులను ఆకర్షించినట్టు తెలిపారు.
ఓపెనింగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, గిఫ్ట్‌లు ఇస్తున్నట్లు చెప్పారు. ఫ్లు చికెన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందన్నారు. మరింత సమాచారం కోసం 99591 54371/ 99639 80259 నంబర్లలో సంప్రదించాలన్నారు.