రాజేంద్రనగర్, జనవరి 10: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ షో ఆకట్టుకుంటోంది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) తొలిసారిగా పుష్పఉత్సవ్ హార్టికల్చర్ షోను నిర్వహించింది. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సమీపంలోని ఏరో ప్లాజా, కార్ పార్క్ లెవల్ వద్ద శుక్రవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జీహెచ్‌ఐఏఎల్ ఉన్నతాధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సీజనల్ పూలు, క్రిసాంథెమస్, డాలియస్, ఇకెబానా, కట్ వివిధ పూలను సుందరంగా అలంకరించారు.