22-03-2025 04:31:39 PM
వైరా (విజయక్రాంతి): వైరా మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డుకు చెందిన మాజీ జడ్పీటీసీ, సోమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వర్గీయ కేతినేని సత్యనారాయణ, సతీమణి కేతినేని సీతారావమ్మ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వారి మరణ వార్త తెలియగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అక్కడకు చేరుకొని వారి భౌతిక కాయానికి పూలమాల వేసిఘనంగా నివాళులు అర్పింఛారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, బోళ్ళ గంగారావు, మద్దినేని రమేష్, పమ్మి అశోక్, శీలం చంద్రశేఖర్ రెడ్డి, పెద్దప్రోలు లక్ష్మయ్య, కేతినేని అచ్చయ్య, తాళ్ళ వసంతరావు, తెళ్ళురి వీరయ్య, మేడీశెట్టి కృష్ణ, లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.