calender_icon.png 16 April, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల అణచివేతలు, కుల దుహంకార పీడనలు లేని ఆత్మగౌరవ సమాజం కోసం పోరాడిన విప్లవకారుడు..

14-04-2025 08:44:06 PM

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): భారతరత్న, ప్రపంచ జ్ఞాని, భారత రాజ్యాంగ రచయిత, బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎం.డి. రాసుద్దీన్, ఇల్లందు డివిజన్ నాయకులు, తోడేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ... 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో జన్మించిన డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ చిన్నతనం నుండే అనేక కష్టాలు పడి ఈ దేశంలో అంటరానితనం, మహిళా హక్కులు, సమాన హక్కులు, కుల నిర్మూలన, అంటరానితనం నిర్మూలనకు అనేక పోరాటాలు చేసిన మేధావి అని అన్నారు.

ఇప్పుడున్న పాలకులు రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన ఇది సరైన పద్ధతి కాదని వారన్నారు.డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పూర్తిగా అమలు అయితే ఈ దేశంలో నిరుద్యోగం ఉండదని,కుల అసమానతలు ఉండవని వివరించారు. ఈ కార్యక్రమంలో తొగర సామెల్, గూల్ల సదయ్య ,టి.లాలు, రామిశెట్టి నరసింహారావు, మండల వెంకన్న, మహేందర్, రాసాల లింగయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.