calender_icon.png 1 November, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

13-09-2024 02:34:42 AM

ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. వర్షాలు, వరదల కారణంగా కనివిని ఎరుగని రీతిలో నష్టం వాటిల్లిందని, అనేకమంది నిరాశ్రయులుగా మారారని.. తక్షణమే కేంద్రం రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు.

ఖమ్మంలో మున్నేరు కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయని, అనేక మంది కట్టు బట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. మణుగూరు, పాల్వంచ మండలాల్లో పలు గ్రామాలు  నీట మునిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు, ఇళ్లు నష్టపోయిన వారికి రూ.16,500 ఇస్తోందన్నారు. ప్రస్తుత ధరల కనుగుణంగా ఎకరానికి రూ.30 వేలు, ఇంటికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.