calender_icon.png 15 November, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెయిన్‌ను మళ్లీ ముంచెత్తిన వరదలు

15-11-2024 01:48:49 AM

మాడ్రిడ్, నవంబర్ ౧౪

భారీ వర్షాలతో మళ్లీ స్పెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. స్పెయిన్ తీర ప్రాంతాలను బుధవారం కుండపోత వర్షాలు ముంచెత్తాయి. దీంతో మలగా సహా మరో నాలుగు తీర ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ నివేదిక ప్రకారం నవంబర్ నెల మొత్తంలో మలగా ప్రాంతంలో 100.5 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండగా కేవలం గంటలోనే 78 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు, నివాసాలు ధ్వంసం అయాయి.

తూర్పు స్పెయిన్‌లోని పైపోర్టాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రైల్వే ట్రాక్‌పై భారీగా చెత్త పేరుకుపోయింది. స్పెయిన్‌కు వర్ష ముప్పు ఇంకా పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. కేవలం రెండు వారాల క్రితమే వాలెన్సియా ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.