calender_icon.png 27 October, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పొంగిన వాగులు, వంకలు

01-09-2024 01:09:51 PM

పలు గ్రామాలకు రాకపోకలు బంద్.

వరద ప్రవాహం లో చిక్కుకున్న పలువురు.

స్వయంగా పర్యవేక్షించిన ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్.

ఖమ్మం,(విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండప ల్లి మండలాల్లో పలు చెరువులు కుంటలు ఏడతెరిపి లేని వర్షంతో పొంగిపోర్లాయి. కాగా పాలేరు రిజర్వాయార్ ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీ వరద చేరడంతో దాని సామ ర్ధ్యనికి మించి 25 అడుగుల పైగా వరద రావడం తో పాలేరు జలాశయం అన్ని గేట్లు లేపిన అలుగు వద్ద ఖమ్మం -సూర్యాపేట రహదారి మీద భారీ వరద చేరి రాకపోకలు బంద్ అయ్యాయి అదే విధంగా ఖమ్మం -సూర్యాపేట జాతీయ రహదారి బైపాస్ వద్ద కూడా వరద నీరు భారీగా రహదారి మీద ప్రవహిస్తుండటంతో బైపాస్ మీద కూడా రాకపోకలు బంద్ అయ్యాయి.

భారీ వర్షాల కారణంగా నాలుగు మండలాల్లో చెరువులు కుంటలు అలుగు పోయడంతో గ్రామాల మధ్య రాక పోకలు నిలిచి పోవడంతో పాటు విధ్యుత్ సరఫరా నిలిచి పోయింది. కూసుమంచి మండలంలోని నర్సింహుల గూడెం సబ్ స్టేషన్ 80శాతం నీట మునిగింది. సాగర్ ఏడమ కాలువ కు నీటి ఉదృతి పెరగడంతో పాలేరు మినీ హైడల్ ప్రాజెక్ట్ నీట మునిగింది. అంతే కాక కాలువ కు గండి పడింది. పాలేరు లోతట్ట్టు ప్రాంతంలో ఉన్న వడ్డెర కాలనీ వాసులను,నడిమి తండా ఇల్లు నీట మునగదాంత వారిని పునరావాస కేంద్రాలకు తరిలించారు.

కాగా వారి ఇండ్లన్నీ నీట మునిగాయి. నాయకన్ గూడెం వద్ద పాలేరు అలుగు ఉదృతి లో ఒక కుటుంబం నీట మునగడంతో వారు ఇల్లు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తుండగా స్వయంగా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి డ్రోన్ల సహాయం తో వారికి లైఫ్ జాకెట్ లు లైఫ్ సేవింగ్ ట్యూబ్ లను పంపించారు. వారిని కాపాడటానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రూరల్ మండలం అకేరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఐదుగురు యువకులు చూడటానికి వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారిని అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కూసుమంచి, తిరుమలయాపాలెం మండలాల్లో పలు గ్రామాల చెరువులు ఉదృతంగా అలుగు పోస్తుండటంతో రాక పోకలు బంద్ అయ్యాయి.