యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీటిని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది
మంథని,(విజయక్రాంతి): ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మంథనీ మున్సిపాల్ పరిధిలోని గంగాపురి గ్రామంలోని నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. గంగాపురి స్టేజి వద్ద ప్రధాన డ్రైనేజీ కురుకుపోవడంతో సమస్య తలెత్తింది. వరద నీరు పిల్లలు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద నీటి సమస్యను గ్లామస్తులు మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే తమ సిబ్బందిని పంపించి జెసిబి తో సహా పంపించి యుద్ధ ప్రాతిపదికన వరద నీరు బయటకి వెళ్లడానికి తగు ఏర్పాటు చేశారు. పేరుకుపోయిన పూడికను తొలగించి వరద నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకున్నారు. గంగపురి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.