సింగరేణి సీఎండీ ఎన్ బలరాం
హైదరాబాద్, అక్టోబర్ 05, (విజయక్రాంతి): భారీవర్షాల కార ణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇంకా పెద్దఎత్తున నిల్వ ఉన్న నీటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలని, అవస రమైతే అదనపు పంపులు వినియోగించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించా రు. శనివారం సింగరేణి భవన్ నుం చి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. నీటిని ఎత్తిపోయడంలో అన్ని ఏరియాల జీఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే అర్ధ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మిగిలిన తెరిపి కాలంలో ఇచ్చిన లక్ష్యాలను దాటి ఉత్పత్తులు సాధించాలన్నారు. ఏరియా జనరల్ మేనేజర్లు సూచించిన కొన్ని సమస్యలపై తక్షణమే స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు.