calender_icon.png 18 November, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు వరద పోటు

20-07-2024 06:33:44 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటేత్తోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు, వాగులు, చెరువులల్లో వరద నీరు పెరుగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి.

భద్రాచలం వద్ద 33 అడుగుల స్థాయికి గోదావరి నీటిమట్టం చేరింది. శనివారం రాత్రికి 41 అడుగుల స్థాయికి గోదావరి నీటిమట్టం చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది.దీంతో నారాయణపూర్‌ ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు.

తెలంగాణలో శుక్రవారం రాత్రి నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు హైదరాబాద్ లోనూ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.