సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మున్సిపాలిటి పరిధిలో పెద్ద చెరువు వద్ద ముంపు బాధితుల జేఏసీ మంగళవారం నిరసనలు చేపట్టింది. పెద్దచెరువు ఎఫ్టీఎల్ పెరగడంతో భూములు కోల్పోయామని స్థానికులు పది రోజులు నుంచి పెద్దచెరువు కట్టపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ అమీన్ పూర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు. దీంతో కమిషనర్ రాకతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తామని బాధితులు చెప్పారు. గతంలో 93 ఎకరాలు ఉన్న చెరువు ప్రస్తుతం 450 ఎకరాలకు విస్తరించిందని, పెద్ద చెరువులోకి మురుగునీరు, కాలుష్య వ్యర్థ జాలాలు రావడంతో ఎఫ్టీఎల్ పెరిగిందని బాధితులు వాపోయ్యారు.