calender_icon.png 27 November, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18వ రోజుకు చేరిన ముంపు బాధితుల దీక్ష

27-11-2024 03:02:31 PM

పటాన్ చెరు(విజయక్రాంతి): అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ముంపు సమస్య పరిష్కారం కోసం జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ముంపు బాధితులు అమీన్ పూర్ పెద్ద చెరువు కట్టపై నెల రోజుల పాటు నిరసన దీక్షకు పూనుకున్నారు. నిరసన దీక్షలో భాగంగా బుధవారం కమిషనర్ జ్యోతి రెడ్డిని మున్సిపల్ కార్యాలయంలో కలిసి అమీన్ పూర్ చెరువులోకి డ్రైనేజీ నీరు రాకుండా పైప్ లైన్లు వేయాలని కోరారు. స్పందించిన ఆమె రూ.15 కోట్లతో ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణానికి అంచనా వ్యయం సిద్ధం చేశామని, నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతామని కమీషనర్ చెప్పినట్లు జేఏసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు, సత్యమూర్తి, టీవీ రావు, ఎమ్మెస్ బాబు, సత్యనారాయణ రాజు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.