calender_icon.png 22 January, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణాబేసిన్‌లో వరద ఉధృతి

01-09-2024 12:47:57 AM

సాగర్‌కు 3.87 లక్షల క్యూసెక్కుల వరద 

హైదరాబాద్/నాగర్‌కర్నూల్/వనపర్తి/నిర్మల్(విజయక్రాంతి), చర్ల, ఆగస్టు 31: కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కు రుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఆల్మ ట్టి, నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద వస్తున్నది. ఇక కృష్ణా ఉప నదులైన భీ మా, తుంగభద్రకు సైతం వర ద ప్రభావం భారీగానే ఉంది. జూరాలకు 3.36 లక్షలు, శ్రీశైలానికి 4.10 లక్షలు, సాగర్‌కు 3.87 ల క్షల క్యూసెక్కుల వరద కొన సాగుతోంది. ఎ గువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువనకు వదులుతు న్నారు. కడెం ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భా రీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారు లు 22 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి వదులుతున్నారు.