calender_icon.png 19 November, 2024 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా పరివాహకంలో పెరిగిన వరద ప్రవాహం

20-07-2024 08:23:47 PM

హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలు వరద నీటీతో నిండు కుండాలను తలపిస్తున్నాయి. కర్ణాటకలో కృష్ణా పరివాహకంలో పెరిగిన వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి అధికారులు నీటి విడుదల చేశారు.

నారాయనపూర్ ప్రాజెక్టు నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు, జూరాల జలాశయానికి 83 వేల క్యూసెక్యుల ఇన్ ఫ్లో విడుదల చేయగా, జూరాల నుంచి శ్రీశైలం దిశగా వరద ప్రవాహం సాగుతోంది. జూరాల సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7 టీఎంసీలకు పైగా నీరు ఉంది. శ్రీశైలం జలాశయానికి 81,160 క్యూసెక్యుల ఇన్ ఫ్లో వచ్చి  చేరుతుండగా.. ఔట్ ఫ్లో నిల్గా ఉంది. శ్రీశైలం సామర్థ్యం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటీమట్టం 813 అడుగులుగా ఉంది.