calender_icon.png 29 December, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు ముంపు మండలాల్లో వరద నష్టం

03-12-2024 05:05:21 PM

జిల్లాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో వరదల సన్న సమయంలో జిల్లాలో ఏడు ముంపు మండలాలు వరదల కారణంగా పంట నష్టం ఆస్తి నష్టం సంభవిస్తుందని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ డిజాస్టర్ బృందానికి వివరించారు. మంగళవారం డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర, రాష్ట్ర బృందం సభ్యులు జిల్లాలో పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఈ సీజన్ లో వర్షాలు, వరదల వల్ల జిల్లాలో సంభవించిన నష్టాలను, అధికారులు చేపట్టిన సహాయక చర్యలను బృందం సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

భారీ వర్షాలు నేపథ్యంలో ఏడు ముంపు ప్రభావిత మండలాల్లో పంట నష్టంతో పాటు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థ వంటివి ప్రాంతాల వారీగా వివరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలను తెలిపారు. అదేవిధంగా వరద ముంపు ప్రాంతాల ప్రజలకు శాఖల వారీగా అప్రమత్తమై చేపట్టిన తక్షణ చర్యలు, గోదావరి వరదలు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించిన విధానాలను జిల్లా అదనపు కలెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం సభ్యులకు తెలిపారు. వరదల సమయంలో సహాయక చర్యలను చేపట్టేందుకు వినియోగించిన భారీ డ్రోన్లు, పుట్టీలు, పడవలు ఇతర పరికరాల గురించి తెలిపారు.

పలుమార్లు గోదావరి పెరిగినప్పుడు భద్రాచలం పట్టణ వాసులకు చేపట్టిన తక్షణ చర్యలు, వరదలు తగ్గిన తర్వాత నిర్వహించిన పారిశుద్ధ్య పనులు, పోలీసులు, వైద్యశాఖ తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించిన మార్గదర్శకాలను అదనపు కలెక్టర్ వివరించారు. వరదల వలన వివిధ శాఖల ఆధ్వర్యంలో జరిగిన నష్టాల అంచనాలను బృందం సభ్యులకు జిల్లా అధికార యంత్రాంగం వివరించింది. అనంతరం కేంద్ర బృందం సభ్యులు జిల్లాలోని వరద ముంపు గురైన మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలలోని పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. జిల్లాకు వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారుల బృందంలో ప్రవీణ్, శ్రీనివాస చారి ఐశ్వర్య రవి పాల్ అథికలాం, సాయిబాబా, ప్రదీప్ కుమార్, వరుణ్, మోతిలాల్, శ్రీనివాస్ ఉన్నారు.