calender_icon.png 25 October, 2024 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల అనుసంధానంతోనే వరద కట్టడి

25-10-2024 12:15:48 AM

  1. వాటర్ ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ మన్సీబాల్ భార్గవ
  2. తక్కువ ఖర్చుతో చెరువుల పరిరక్షణపై హైడ్రా అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని, అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో తలెత్తకుండా ఉండాలంటే చెరువులను గొలుసుకట్టుగా అనుసంధానం చేయడంతో పాటు నాలా వ్యవస్థ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని వాటర్ ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ డాక్టర్ మన్సీబాల్ భార్గవ సూచించారు.

శరీరానికి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో.. చెరువులకు నాలా వ్యవస్థ కూడా అంతే అవసరమని, అందుకు చెరువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్‌లో చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జల వనరుల అభివృద్ధికి సంబం ధించిన పలువురు పరిశోధకులు, నిపుణులతో హైడ్రా ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్‌లో మన్సీబాల్ భార్గవతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు గురువారం సమావేశమయ్యారు. తక్కువ ఖర్చుతో చెరువులను పునరుజ్జీవనం చేసే విధానాలపై ఆమె పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంక్రీట్ కట్టడాలు కాకుండా సహజ సిద్ధంగా చెరువులను పునరుద్ధరించినప్పుడే వాటిలో జీవకళ ఉంటుందన్నారు.

ఆ నీరు జీవరాసులకు ఉపయోగపడుతుందని తెలిపారు. చెరువులకు కాల్వలు జీవనాడుల వంటివని, ముం దుగా చెరువులను పరిరక్షించుకుంటూ, ఆ తర్వాత కాల్వల నుంచి మంచినీరు వచ్చేలా చేయడంతో చెరువులలో కాలుష్యం తగ్గుతుందంటూ సూచిం చారు. చెరువుల పునరుద్ధరణతోనే నగరానికి వరద ముప్పు తప్పుతుందన్నారు. వరద నీరు చెరువుకు చేరాల ని, చెరువులు నిండి ఆ నీరు నదుల్లో కలవాలన్నారు.

అలా కాకుండా ఆటంకాలు ఏర్పడితే నివాసాలు నీట మునుగుతాయని అన్నారు. చెరువులలో ఆక్రమణలు తొలగించడం అంటే నగరం ముంపునకు గురికా కుండా చేసే శస్త్ర చికిత్స వంటిదని వివరించారు. ఈ సందర్భంగా నగరంలో చెరువుల పరిస్థితిపై సమీక్ష, వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు హైడ్రా తీసుకుంటున్న చర్యలను కమిషనర్ రంగనాథ్ డాక్టర్ అమెకు వివరించారు.