calender_icon.png 16 November, 2024 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదలు తెచ్చిన లాభం!

16-11-2024 01:09:32 AM

  1. గోదావరిలో భారీగా ఇసుక మేటలు
  2. మేడిగడ్డలో  80 లక్షలు టన్నులు,  అన్నారం, సుందిళ్లలో 1.9 కోట్ల టన్నులకు టెండర్లు
  3. ఈ ఏడాది లక్ష్యం రూ.6,588 కోట్లు

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ఈ వరదలు గనుల శాఖకు మాత్రం లాభాలను తెచ్చిపెడుతున్నాయి. వరదలతో గోదావరిలో ఇసుకమే టలు వేశాయి. ఈ ఇసుక వేలంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచించే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. 

మేడిగడ్డ వద్ద 80లక్షల టన్నులు.. 

ఈ వానకాలంలో కురిసిన వర్షాలకు కొట్టుకొచ్చిన ఇసుక మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీగా నిక్షిప్తమయ్యింది. ఈ మేటలను గను ల శాఖ లెక్కించి సుమారు 80లక్షల టన్నుల ఇసుక ఉన్నట్టు తేల్చింది. వెంటనే ఇసుక క్వారీలకు టెండర్లను పిలిచింది. ఫలితంగా భారీ ఆదాయం వస్తుందని గనుల శాఖ అంచనా వేస్తోంది.

అన్నారం, సుందిళ్ల వద్ద 1.90 కోట్ల టన్నులు.. 

మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల వద్ద కూడా భారీ ఇసుక మేటలున్నాయి. సాంకేతిక పద్ధతుల ద్వారా అంచనా వేసిన గనుల శాఖ.. ఇక్కడ సుమారు 1.90 కోట్ల టన్నుల ఇసుక నిక్షిప్తమై ఉన్నట్టు తేల్చింది. ఇక్కడ నీటి ప్రవాహం ఉన్నప్పటికీ వీలైనంత త్వరగా వేలం నిర్వహించేందుకు గనుల శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

ఏడు నెలల్లోనే రూ.4,1౩8 కోట్లు..

2024 ఆర్థిక సంవత్సరంలో గను లు, భూగర్భ శాఖ ఆదాయంలో వేగంగా ముందుకు సాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఇసుక, మైనర్ మినరల్స్, మేజర్ మినరల్స్ మొత్తం కలుపుకొని రూ.6,588 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి ఏడు నెలల్లోనే సుమారు రూ.4,138 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సగటున లెక్కిస్తే ఏడు నెలల్లో పొందాల్సిన ఆదాయం రూ.3,843 కోట్లు కాగా.. అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. దీంతో మిగిలిన ఐదు నెలల్లో మరింత ఆదాయాన్ని పొందాలనే లక్ష్యంతో సంబంధిత శాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.

ఇసుకతో మరింత ఆదాయం..

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ ల చుట్టూ నిక్షిప్తమైన సుమారు 2.7కోట్ల టన్నుల ఇసుక క్వారీల వేలంతో గనుల శాఖకు ఈఏడాది మరింత ఆదాయం చేకూరనున్నది. రానున్న ఐదు నెలలు గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో.. క్వారీల్లో తవ్వకాలు చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ సమయంలోనే నిర్మాణాలు వేగంగా సాగుతుంటాయి.

రియల్ ఎస్టేట్, ప్రజల అవసరార్థం ఇసుకను అందుబాటులో ఉంచేందుకు చర్య లు తీసుకుంటున్నట్టు గనులు, భూగర్భ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహ న్ ‘విజయక్రాంతి’కి తెలిపారు. అవసరమైనవారు sand.telangana.gov.in వెబ్ సైట్‌లో వివరాలు నమోదుచేసి ఇసుకను తీసుకెళ్లవచ్చని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచేందుకు చర్య లు తీసుకున్నామని తెలిపారు.