calender_icon.png 20 September, 2024 | 2:47 AM

విద్యా సామర్థ్యాలు పెంచేలా..

19-09-2024 07:48:36 PM

రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుద్దాం... జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్

జిల్లా అంతటా 'ఎఫ్ఎల్ఎన్ లిప్' అమలు

ఈ విద్య సంవత్సరం కొరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి

నారాయణపేట,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కేజీబీవి నారాయణపేట జిల్లాలోని మండల నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణపేట ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లల్లో విద్యా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం ప్రాథమిక స్థాయిలో (ఎఫ్ఎల్ఎన్) ఫౌండేషన్ లెర్నింగ్ న్యూమరసీ, ఉన్నత విద్యార్ధుల ప్రగతి కోసం లిప్ (లెర్నింగ్ ఇంప్రూ మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాలను పునరుద్ధరించారు. అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 334 ఉండగా, 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 25,000 మంది విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరిలో కనీస అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు ఫౌండేషనల్ లెర్నింగ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా ప్రతి మూడు నెలల కోసారి బేస్ లైన్ మధ్యంతర, తుది పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమికోన్నత 85, ఉన్నత పాఠశాలలు 76, కేజీబీవీ 11, మోడల్ పాఠశాల లు 2 ఉన్నాయి. వీటిలో 6 నుంచి 9వ తరగతి వరకు సుమారు 41,600 విద్యార్థులు విద్యన భ్యసిస్తున్నారు. వీరిలో అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు లిప్ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రతి మూడు నెలలకోసారి సామర్థ్యాల పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో బేస్లైన్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్లో మధ్యంతర, మార్చిలో తుది విడత పరీక్షలు నిర్వహించి అభ్యాసన సామర్ధ్యాలు పెంపొందించనున్నారు. వర్షిట్స్, సిలబస్ మాడ్యుల్. పాఠ్యపుస్తకాల ఆధారంగా బోధన చేయాలని కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈఓ, ఎంఎన్ఓ, కాంప్లెక్స్ హెచ్ఎంల పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

మండల నోడల్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు ప్రతి పాఠ శాలను సందర్శించి ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్ర మాలను పరిశీలించాలి. ఎఫ్ఎల్ఎన్, లిప్ ప్రోగ్రాంపై ఇప్పటికే దిశానిర్దేశం చేశాం. ప్రస్తుతం అభ్యాసన సామర్ధ్యాల పరీక్షలు జరుగుతున్నాయి. కాం ప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలోని ప్రతి పాఠశాలను సందర్శించి పర్యవేక్షించాలి. రెండు నెలల్లో సామ ర్థ్యాలు పెరిగి నేషనల్ అచీవ్మెంట్ ప్రోగ్రాంకు విద్యార్థులు సిద్ధం కావాలి. ఆ దిశగా ఉపాధ్యాయులు ఎంఎన్ఓ, ఎంఈఓ, హెచ్ఎంలు కృషి చేయాలని అన్నారు. ప్రతి మండల నోడల్ అధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మొహమద్ అబ్దుల్ ఘనీ, విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, రాజేందర్, ఇన్చార్జి ఏఏంఓ రామచంద్ర చారి,  డిఎస్ఓ భానుప్రకాష్, ఆర్పీలు, అలోకిత్ ఫౌండేషన్ సభ్యులు యాదునందన్, ఆంజాద్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.