రాజేంద్రనగర్, అక్టోబర్ 28: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమా నాశ్రయం నుంచి బ్యాంకాక్‌లోని డాన్ మ యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం నుంచి థాయ్ ఎయిర్ ఏషియా నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయి. థాయ్ ఎయిర్ ఏషియా అనేది థాయ్ బడ్జె ట్ విమానయాన సంస్థ. ఇది బ్యాంకాక్, థా యిలాండ్‌లోని ఇతర నగరాల నుంచి సరసమైన దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను అ ందిస్తోంది.
బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం(బీఎంకే) ఎఫ్ డీ 119 విమానం హైదరాబాద్ నుంచి 23. 25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు స్థానిక కాలమానం ప్రకారం 4.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు విమానం ఎఫ్ డీ 118 బ్యాంకాక్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం 20.50 గంటలకు బయలుదేరి 22. 55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ నాన్‌స్టాప్ ఫ్లుటై సర్వీస్ ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉండనుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. థాయ్ ఎయి ర్ ఏషియాతో బ్యాంకాక్‌కు కొత్త విమానాల సర్వీసులపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీ ప్ పాణికర్ హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరచడంలో, వ్యా పారాలను ప్రోత్సహించడంతో పాటు హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య సంబంధాలను బ లోపేతం చేయడంలో ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు.