calender_icon.png 4 March, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ మాసం సందర్భంగా విధుల్లో వెసులుబాటు కల్పించాలి..

04-03-2025 08:35:59 PM

మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ సమయాల్లో వెసులుబాటును కల్పించాలని ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు, ఏరియా ప్రాతినిధ్య సంఘం నాయకులు ఉత్సవాయి కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు మంగళవారం ఏరియా ఎస్ ఓ టు జిఎంకు వినతిపత్రం అందజేశారు. ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్ష ప్రారంభ సమయం ఉదయం సహిరి ముగింపు ఇఫ్తార్కు విధి నిర్వహణ సమయంలో వెసులుబాటు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు షాబుద్దీన్, ముస్లిం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.