calender_icon.png 25 October, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో ఫ్లెక్సీ వివాదం!

28-08-2024 12:40:21 AM

  1. రాజముద్ర మార్పుపై రాజకీయ రగడ 
  2. ఎక్స్ వేదికలో కేటీఆర్ పోస్టుతో కలకలం 

హనుమకొండ, ఆగస్టు 27 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర వివా దానికి దారితీసింది. ఆ ఫ్లెక్సీలో ప్రభుత్వ రాజముద్రను మార్పు చేస్తూ ప్రింటింగ్ చేయడం కలకలం రేపింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ చర్యను తప్పు పడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయ డంతో రాజకీయ రంగు పులుముకుంది. ఇది ప్రస్తు తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ప్రభుత్వం అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖా స్తు ప్రక్రియను ప్రారంభించింది.

ఈ మేరకు వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో దర ఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 25న ఎల్‌ఆర్ ఎస్‌పై ప్రజలకు అవగాహన కోసం మున్సి పల్ కార్యాయలంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పా టుచేశారు. హెల్ప్‌డెస్క్ పేరిట కార్యాలయం ఎదుట ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలో రాజముద్రలో పలు మార్పులు చేయడం వివాదానికి దారితీసింది. కొద్దిరోజుల కింద ట సీఎం రేవంత్‌రెడ్డి రాజముద్రలో మార్పు లు చేయాలనే ఆలోచనతో పలు నమూనా లు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. 

రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మి నార్ చిహ్నలను తొలగించాలని నిర్ణయిం చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెను దుమా రం లేచింది. రాజముద్రలోని చిహ్నాలు తొలగిస్తే ఊరుకునేది లేదంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. దీంతో రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ వరం గల్ కార్పొరేషన్ కార్యాయలంలో ఎల్‌ఆర్ ఎస్ హెల్ఫ్‌డెస్క్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాజముద్రను మార్పు చేయడం చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి నిర్ణయా న్ని అధికారులు అమలు చేస్తున్నట్టుగా వారి చర్యలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్త రాజముద్ర ఎప్పుడు ఆమోదించారు? కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొ రేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పా టు చేసిన ప్లెక్సీలో కొత్త చిహ్నం ఏప్పుడు ఆమోదించారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఒక వేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీనిని వాడుతున్నారని, దీనికి కారకులు ఎవరో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసేలా రాజముద్రలో మార్పులు చేసే ప్రతిపాదన ముందుకు తెచ్చిందని మండి పడ్డారు.

ప్రజల నుంచి వ్యతిరేకత రావ డంతో సర్కార్ వెనక్కి తగ్గిందని, గ్రేటర్ వరంగల్ అధికారులు మాత్రం అత్యు త్సాహం చూపి రాజముద్రను మార్చారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం వరంగ ల్ చారిత్రక గొప్పదనాన్ని తెలిపేలా రాజ ముద్రలో కాకతీయ కళాతోరణాన్ని పెడితే, వరంగల్ నగర ఔన్నత్వాన్ని తగ్గించేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.