14-04-2025 07:07:57 PM
ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేనందుకు నిరసన..
దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా..
మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్..
కామారెడ్డి (విజయక్రాంతి): అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో నిరసనకు దిగడంతో ప్లెక్సీ వివాదం రగడ నెలకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి రగడను సద్దుమనిగీపించారు. ప్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం వల్ల ఫ్లెక్సీ తొలగింపుతో చినుకు చిలికి గాలివానగా మారి ధర్నా వరకు దారి తీసింది. లింగంపేట మాజీ ఎంపీపీ అంబేద్కర్ మండల గౌరవ అధ్యక్షుడు మూదాం సాయిలు అంబేద్కర్ తో కూడిన ప్లెక్సీ తొలగించడంతో వివాదం తెరపైకి రావడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఫోటో లేకపోవడంతో ఈ ఫ్లెక్సీ వివాదానికి తెర పైకి వచ్చింది.
ఇరువు వర్గాల కు చెందిన వారి మధ్య వివాదం తలెత్తడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలానికి ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ రావడంతో కొద్దిసేపు వేచి చూసి ఎంతకీ వినకపోవడంతో మాజీ ఎంపీపీ ముధం సాయి లు ను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అక్కడే ఉన్న దళిత సంఘాల సభ్యులు గౌరవాధ్యక్షుడు ముదాం సాయిలు ను ప్యాంటు లేకుండా పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీపీని అగౌరవపరచారని దళితులు డిమాండ్ చేశారు. అగౌరవపరిచిన సిఐని సస్పెండ్ చేయాలని అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్నాకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే
లింగంపేట్ లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల వివాదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ డిమాండ్ చేశారు. లింగంపేట చేరుకొని దళితుల తో కలిసి ఆందోళన చేపట్టారు. పోలీసులు అరెస్టు చేసిన మాజీ ఎంపీపీ ముదాం సాయిలు ను విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న బాన్సువాడ డి.ఎస్.పి
కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఫ్లెక్సీ ఏర్పాటు లో వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లింగంపేటకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు దళిత సంఘాల ప్రతినిధులకు నచ్చజెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమనిపించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు దళితులను రెచ్చగొట్టడం వల్లనే వివాదం తలెత్తిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఎస్పి సత్యనారాయణ విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. లింగంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణి గాయని డి.ఎస్.పి పేర్కొన్నారు.