10-04-2025 01:09:57 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం దాటికి నష్టం వాటిల్లింది. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్ పై నిర్మించిన ఫ్లెక్సీ దిమ్మెలు కూలిపోయి కిందికి వంగాయి. వంగిన ఫ్లెక్సీ దిమ్మెలు కింద పడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రైవేటు షాపింగ్ కాంప్లెక్స్ లపై వ్యాపారులు మున్సిపల్ అనుమతులు తీసుకోకుండానే అడ్వర్టైజ్మెంట్ కోసం ఫ్లెక్సీ దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని కమర్షియల్ కాంప్లెక్స్ లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు సిమెంటు దిమ్మెలను నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ప్రైవేటు కాంప్లెక్స్ లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.