10-04-2025 12:38:24 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముషీరాబాద్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు బద్రి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం చౌరస్తా వద్ద ప్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు. అదే చోట జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉండడంతో నాయకులంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
కొంతమంది ఫ్లెక్సీ బోర్డు చూసి అందులో కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ ఫోటో లేకపోవడంతో ఈ విషయాన్ని కార్పొరేటర్ భర్త బీజేపీ ముషీరాబాద్ నియోజక వర్గ జాయింట్ కన్వీనర్ నవీన్ గౌడ్ దృష్టికి డివిజన్ నాయకులు తీసుకెళ్లారు. దీంతో నవీన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ బోర్డు ఏర్పాట్ల లో ప్రోటోకాల్ పాటించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నాలుగేళ్లుగా తాము ప్రతి కార్యక్రమంలో ప్రోటో కాల్ పాటించడంతో పాటు కొత్త, పాత నేతలను కలుపుకొని సమావేశాలకు ఆహ్వాని స్తున్నామని, ఫ్లెక్సీ బోర్డులలో ఫోటోలు సైతం పెడుతున్నామని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీ బోర్డులో కార్పొరేటర్ ఫోటో లేకుండా ఎలా ఏర్పాటు చేస్తా రని బద్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఇదే క్రమంలో బద్రీ నారాయణ ను శివాలయం చౌరస్తా నుంచి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు తీసుకెళ్లడంతో గొడవ కాస్త సద్దు మణిగింది. ఇదిలా ఉంటే ఇరువురి నేతల మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేకపోవడం వల్లే గొడవకు దారితీస్తుందని అక్కడున్న బీజేపీ నాయకులు పేర్కొన్నారు.