28-03-2025 09:43:05 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అసోసియేషన్ నిర్ణయించిన ధరలకే ఫ్లెక్సీ ప్రింటింగ్ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శశిధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శివాజీ భవన్ లో జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడిగా స్వాగత్, ప్రధాన కార్యదర్శిగా గుండు శ్రావణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా అశోక్, కోశాధికారిగా కిరణ్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ... ఫ్లెక్సీ ప్రింటింగ్ పై ఆర్థిక భారం పెరిగినందున యూనియన్ విడుదల చేసిన చాట్ ప్రకారమే ప్రింట్ చేయాలని తెలిపారు. ఆర్థికంగా సామాజికంగా సంఘం ముందుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం ఉంటుందని తెలిపారు.యూనియన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించిన రాష్ట్రస్థాయి యూనియన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు పాల్గొన్నారు.