calender_icon.png 23 September, 2024 | 10:47 PM

ఫ్లాష్‌బ్యాక్- లేనిది ఎవరికి?

22-09-2024 12:00:00 AM

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి చిత్రాలను అందించిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. ఏఎస్ రుగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘లేనిది ఎవరికి?’ అనేది ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి ప్రభాకర్ రెడ్డి డీవోపీ కాగా, జేబీ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ, వరంగల్ శ్రీను లిరిక్స్ అందిస్తున్నారు. నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.