calender_icon.png 22 February, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమిషనర్ పర్యటన

21-02-2025 12:00:00 AM

  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ  స్థల పరిశీలన 

పసుమాములల, మజీద్‌పూర్‌లను విజిట్  చేసిన శశాంక 

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 20: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమిషనర్ శశాంక (ఐఏఎస్)  అబ్దుల్లా పూర్‌మెట్ మండలంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం కుల, మత బేదాలు లేకుండా అందరికీ ఒకే స్కూల్ చదువుకునే విధంగా.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది.

అందులో భాగంగా ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టు కమిషనర్ శశాంక పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 422 ఉన్న51 ఎకరాల ప్రభుత్వ స్థలానికి పరిశీలించారు. అదే విధంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్‌పూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 224లో దాదాపుగా 40 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉంది.

పసుమాముల, మజీద్‌పూర్ గ్రామాలలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలన చేశారు.  ఈయన వెంట ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ జ్యోతి, ఆర్‌ఐలు ఇంద్రాణి, నిజాముద్దీన్, సిబ్బంది తదితరులు ఉన్నారు.