calender_icon.png 14 December, 2024 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలంక టీ10లో ఫిక్సింగ్ భూతం

14-12-2024 12:24:32 AM

కొలంబో: శ్రీలంక టీవూ సూపర్‌లీగ్‌లో ఫిక్సింగ్ కలకలం రేగింది. పోలీసులు గాలే మార్వెల్స్ జట్టు ఓనర్ ప్రేమ్‌థాకూర్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ్ థాకూర్ భారత వ్యక్తి కావడం గమనా ర్హం. టోర్నీ మొదలైన మరుసటి రోజే ఈ అరెస్టు చోటు చేసుకుంది. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టినట్లు స్పోర్ట్స్ వ్బుసై ట్ ఈఎస్‌పీఎన్ వెల్లడించింది. క్యాండీలోని ఓ హోటల్‌లో ఉండగా.. థాకూ ర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిక్సిం గ్ ఆరోపణల వల్ల ఓ జట్టు ఓనర్ అరెస్ట్ అయినా కానీ లంక టీ10 లీగ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని టోర్నీ డైరెక్టర్ దోడాన్‌వేలా తెలిపారు.