ఐటి మంత్రిని కలిసి కోరిన బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్..
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వక్స్ బోర్డు సమస్యపై కలెక్టర్ నివేదికను రెవిన్యూ శాఖ ద్వారా త్వరగా పరిష్కరించాలని బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని కోరారు. అదేవిదంగా చెరువుల అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఎన్ఓసి విషయంపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.