calender_icon.png 17 January, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాభిషేకానికి ముహూర్తం ఫిక్స్

17-01-2025 12:29:57 AM

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు మరాఠీ రాజు శంబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 344 ఏళ్ల తర్వాత శంబాజీ జీవిత చరిత్రను తాము వెలుగులోకి తీసుకురానున్నామని మేకర్స్ గర్వంగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ‘పుష్ప2’తో క్లాష్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది.

ఈ సినిమాకు లుకా చుప్పి, లక్ష్మణ్ ఉటేకర్‌ల ద్వయం దర్శకత్వం వహించింది. మడాక్ ఫిల్మ్స్‌పై దినేశ్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహ్మాన్ బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించారు. ఈ హిస్టారికల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ట్రైలర్, చిత్ర విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. శంబాజీ రాజ్యాభిషేకానికి ముహూర్తం ఆసన్నమైందంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్, విడుదల తేదీలను ప్రకటించారు. ‘ఛావా’ ట్రైలర్ ఈ నెల 22న విడుదల కానుంది. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.