ఎల్బీనగర్, డిసెంబర్ 24: ఫోక్సో కేసులో ఇద్దరి నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం వోట్లూరు గ్రామానికి చెందిన గోగు సురేశ్(34) నాగోల్‌లోని నువ్వులబండలో ఉం టూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నాగోల్‌లోనే ఓ మహిళ (34) తన కూతురితో కలిసి ఉంటూ కూలీ పని చేస్తూ జీవిస్తున్నది.
ఆ మహిళతో సురేశ్ సహజీనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళ సహకారంతో ఆమె కూతురి(మైనర్)ని లైంగింకగా వేధించాడు. ఆ బాలిక ఫిర్యాదుతో నాగోల్ పోలీసులు 20 22లో కేసు నమోదు చేసి, సురేశ్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఎల్బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మంగళవారం విచారించి తీర్పు వెలువరించింది. సురేశ్‌తోపాటు బాలిక తల్లికి ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించారు.