ఎల్బీనగర్, సెప్టెంబర్ 10: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నెపల్లికి చెందిన మిద్దపల్లి విక్రమ్ (25) హయత్ నగర్‌లో నివాసం ఉండేవాడు. స్థానికంగా నివసిస్తున్న బాలికతో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి కుటుంబీకులు 2018లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో పూర్తి ఆధారాలు సమర్పించారు. ఎల్బీనగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును విచారిం చింది. ఈ మేరకు పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.