calender_icon.png 24 October, 2024 | 6:02 AM

ఐదేండ్ల ఎఫ్‌డీ..ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ?

14-07-2024 12:23:23 AM

అధిక వడ్డీ రేటు లభించే బ్యాం క్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సాధారణంగా మదుపుదారులు ఆశిస్తుంటారు. బ్యాంక్‌లో డిపాజిట్లకు ఆయా కాలపరిమితులకు అను గుణంగా వడ్డీ రేట్లు ఉంటాయి. పరిమితి పెరిగే కొద్దీ వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఆరు నెలల వరకూ స్వల్పకాలిక డిపాజిట్ అయితే బ్యాంక్‌లు 3 నుం చి 4.5 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. అదే ఒక ఏడాది లేదా అంతకుపైబడితే 6 శాతం వడ్డీ ఉంటుం ది. ఇలా డిపాజిట్ కాలపరిమితి పెరిగితే, వడ్డీ రేటు సైతం అధికమవుతూ ఉంటుంది. ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ప్రధాన బ్యాంక్‌లు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 

ఐసీఐసీఐ బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటు ను ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై అరశాతం అదనంగా లభిస్తుంది.  వీరికి ఇచ్చే వడ్డీ  7.5 శాతం. ఈ రేట్లు జూన్12 నుంచి అమలులోకి వచ్చాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.2 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై 6.7శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు జూన్14 నుంచి అమలులోకి వచ్చాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంక్ ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ  7.5 శాతం. ఈ రేట్లు జూన్15 నుంచి అమలులోకి వచ్చాయి. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఐదేండ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు ఇదే డిపాజిట్‌పై అరశాతం అదనంగా లభిస్తుంది.  వీరికి ఇచ్చే వడ్డీ  7 శాతం. ఈ రేట్లు జూన్10 నుంచి అమలులోకి వచ్చాయి. 

బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంక్ ఐదేండ్ల కాలపరిమితిగల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 6.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. ఈ రేట్లు జూన్12నుంచి అమలులోకి వచ్చాయి.