- వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో అలర్టున కేంద్రం
- ఎన్నికలు నిర్వహించాలి: ఖర్గే
న్యూ ఢిల్లీ, ఆగస్టు 5: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 37౦ను రద్దుచేసి సోమవారానికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను అలర్ట్ చేసింది. ఇటీవల వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్మీకి కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
నిఘావర్గాల సమాచారం మేరకు జవాన్ల రాకపోకలను ఉన్నతాధికారులు నిలిపివేశారు. అమర్‌నాథ్ యాత్ర వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. సైనికులు ఎవరూ ఒంటరిగా ఉండొద్ద ని ఆదేశాలు జారీచేశారు. సరిహద్దు ప్రాంతా ల్లో అదనపు బలగాలను మోహరించారు. సోమవారం ఉదయం బార్డర్ సమీపంలోని అఖ్నూర్, సుందర్‌బనీ సెక్టార్ల వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన ఆర్మీ.. వార్నింగ్ షాట్స్‌ను పేల్చింది.
సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ౩౭౦ రద్దుతో జమ్ములో శాంతి సాధ్యమని ప్రధాని మోదీ ప్రకటించిన అది జరగలేదని విమర్శించారు.