10-03-2025 08:00:49 PM
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి...
చేగుంట (విజయక్రాంతి): ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాలు జైలుశిక్ష 30 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చేగుంట మండలం చిట్టోజీపల్లి గ్రామానికి చెందిన చల్మెడ సురేష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున 2018 జనవరి నెలలో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు పూర్తి విచారణ తరువాత పోలీసులు సమర్పించిన ఆధారాలతో సోమవారం నాడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద నేరస్థునికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు 30 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.