24-02-2025 11:15:38 AM
కోట: రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా(Jhalawar District)లో ఆదివారం బోరుబావిలో పడి 32 అడుగుల లోతులో చిక్కుకున్న ఐదేళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 16 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ తర్వాత సోమవారం తెల్లవారుజామున బయటకు తీశారని గంగ్‌ధర్ ఎస్ డీఎస్ ఛతర్‌పాల్ చౌదరి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (National Disaster Response Force), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (State Disaster Response Force) రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని బయటకు తీశాయని గంగ్‌ధర్ ఛతర్‌పాల్ చౌదరి తెలిపారు. పరీక్షల తర్వాత అక్కడికక్కడే ఉన్న వైద్య బృందం బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు.
ఆదివారం బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో జారిపడిన గంట తర్వాత అందుబాటులో ఉన్న మార్గాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. బాలుడికి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయబడిందని డీఎస్పీ(Deputy Superintendent of Police) జైప్రకాష్ అటల్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్‌మార్టం జరుగుతోందని తెలిపారు. ఈ విషయంలో బాలుడి తల్లిదండ్రులు ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదు సమర్పించారని, తదనుగుణంగా తదుపరి దర్యాప్తు కోసం కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. డగ్ పోలీస్ స్టేషన్(Dug Police Station) పరిధిలోని పారలియా గ్రామానికి చెందిన ప్రహ్లాద్ కుమారుడు కలులాల్ బగారియా అనే బాలుడు పొలంలోని బోరుబావిలో పడిపోయాడు. అతని తల్లిదండ్రులు పొలానికి అవతలి వైపు పనిలో ఉండగా అతను బోరుబావిలో పడిపోయాడని అధికారులు వెల్లడించారు.