calender_icon.png 2 October, 2024 | 3:46 AM

పాంచ్ పటాకా..

18-09-2024 12:50:41 AM

  1. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
  2. ఫైనల్లో చైనాపై విజయం
  3. హర్మన్ సేన ఖాతాలో ఐదో టైటిల్ 

ఆసియా ఖండంలో తమకు ఎదురులేదని నిరూపిస్తూ భారత హాకీ జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి హాకీ ఆసియా చాంపియన్స్‌గా అవతరించింది. ఫైనల్ వరకు ఓటమి ఎరుగని హర్మన్ సేన అంతిమ పోరులో డ్రాగన్ దేశాన్ని చిత్తు చేసి టైటిల్‌ను ముద్దాడింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం ఘనత మరువకముందే మరో ట్రోఫీ సాధించి అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హాకీ వీరులకు వందనం..

హులిన్‌బిర్ (చైనా): ప్రతిష్ఠాత్మక హీరో ఆసియా కప్ హాకీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 1 తేడాతో ఆతిథ్య చైనాను మట్టికరిపించింది.  తొలి మూడు క్వార్టర్లలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న తరుణంలో జుగ్‌రాజ్  సింగ్ (ఆట 51వ నిమిషంలో) గోల్ అందించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడం ఇది ఐదోసారి. గతంలో భారత్ (2011, 2016, 2018, 2023లో) టైటిల్‌ను ముద్దాడింది. ఇక టోర్నీలో ఏడు గోల్స్‌తో మెరిసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచాడు. ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్ 5 తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసింది. గతేడాది జరిగిన మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలోనూ అమ్మాయిలు విజేతగా నిలవడం విశేషం.

ఓటమన్నదే లేకుండా..

లీగ్ దశ నుంచి ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు ఫైనల్లో మాత్రం విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. భారత డిఫెన్స్ విభాగాన్ని ఛేదించుకొని పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసిన చైనా  భారత్ ప్లేయర్ల అటాకింగ్‌ను సమర్థంగా అడ్డుకుంది. దీంతో తొలి మూడు క్వార్టర్స్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. డ్రా అనుకున్న తరుణంలో జుగ్‌రాజ్ గోల్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

అయితే లీగ్ దశలో ఇదే చైనాను భారత్ 3 చిత్తుగా ఓడించడం విశేషం. ఐఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయ ర్ అవార్డుకు భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ నామినేట్ అయ్యారు. మంగళవారం అంతర్జా తీయ హాకీ ఫెడరేషన్ షార్ట్‌లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.