calender_icon.png 10 January, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఓసీ గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్!

22-10-2024 02:44:42 AM

  1. ఢిల్లీలో అవార్డులు అందుకున్న సీఎండీ 
  2. డిప్యూటీ సీఎం అభినందనలు

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): సింగరేణి సంస్థ పరిధిలోని పలు ఓపెన్ కాస్ట్ గనులకు ప్రతిష్ఠాత్మకమైన ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కింది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి నుంచి సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అవార్డులను అందుకున్నారు.

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో ప్రమాద రహిత గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఫైవ్‌స్టార్ రేటింగుతో అవార్డులను అందిస్తోంది. ఈసారి ఈ అవార్డులకు సింగరేణి నుంచి రామగుండం ఏరియాలోని ఆర్‌జీఓసీ 1(ఎక్స్‌టెన్షన్ ఫేజ్ ఇల్లందు ఏరియాలోని జవహర్‌ఖని ఓపెన్ కాస్ట్ గనులు ఎంపికయ్యాయి.

సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఈ అవార్డులను కేంద్ర బొగ్గు శాఖా మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రి సతీశ్‌చంద్రదూబే చేతుల మీదుగా  సీఎండీ బలరామ్, డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, జీఎం జాన్ ఆనంద్, ప్రాజెక్టు ఆఫీసర్ రాధాకృష్ణ, రెసిడెంట్ మేనేజర్ నీరజ్ కుమార్ ఓజా అందుకున్నారు.

380 గనులు రేటింగ్‌కోసం దరఖాస్తు

దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, సింగరేణి, ఇతర ప్రైవేటు సంస్థలకు చెందిన 380 గనులు ఈ ఫైవ్ స్టార్ రేటింగ్‌కోసం దరఖా స్తు చేసుకున్నాయి. ఈసారి ఫైవ్ స్టార్ రేటిం గ్ వచ్చినవాటిల్లో సింగరేణికి చెందిన రెండు ఓసీలు ఉన్నాయి. సింగరేణి గనులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ రావడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఉత్పత్తితోపాటు రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గనులను ఇతర గనులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.