బీబీసీ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ బీబీసీ ‘ఇండియన్ స్పో ర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నా మినేట్ అయింది. మనూతో పాటు పారాలింపిక్స్ చాంపియన్ అవనీ లేఖరా, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, గోల్ఫర్ అదితి అశోక్ రేసు లో ఉన్నారు. పబ్లిక్ ఓటింగ్ ద్వా రా విజేతను నిర్ణయించనున్నారు. జనవరి 31 వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వచ్చే నెల 17న విజేతను ప్రకటించనున్నారు.