ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా మూలమలుపు వద్ద శనివారం ఎదురుగా వస్తున్న సింగరేణి వాహనాన్ని కారు అతివేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన రోహిత్, కిరణ్, కీర్తి, ప్రవళిక, దీప్తి కలిసి హైద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్నారు. ఈ సంఘటనలో డ్రైవర్ రోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.