06-02-2025 12:00:00 AM
పిట్లం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ శివారులోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను బండపల్లి గ్రామంలో పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పిట్లం ఎస్త్స్ర రాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక దాడులు నిర్వహించారు.
అనుమతి లేకుండ ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన వాహనాల యజమానులపై రెవెన్యూ, పోలీస్ చట్టాల మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర రాజు మాట్లాడుతూ ఇసుక రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము అని ఆయన హెచ్చరించారు.