calender_icon.png 15 November, 2024 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీకి 5 క్వింటాళ్ల తరుగు

10-11-2024 12:20:30 AM

రైస్‌మిల్లర్‌తో రైతుల వాగ్వాదం

సిరిసిల్ల, నవంబర్ 9 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి మిల్లుకు తరలించగా, లోడుకు 5 క్వింటాళ్ల వడ్లు తరగు వచ్చాయని రైతులు  ఆందోళనకు దిగారు. కోనరావుపేట మండలం కొలనూర్‌లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముగ్గురు రైతులకు చెందిన ధాన్యం తూకం వేశారు. మొత్తం 944 బస్తాలతో లారీ లోడును గ్రామశివారులోని సరస్వతి రైస్ మిల్లుకు తరలించారు.

ధాన్యాన్ని అన్‌లోడ్ చేసుకున్న మిల్లు నిర్వాహకులు 5 క్వింటాళ్ల షార్టేజీ వచ్చిందని తెలుపడంతో బాధిత రైతులు మిల్లు వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. సెంటర్ నిర్వహకులు మిల్లర్లు కలిసి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తూనికలు, కొలతల అధికారులు ప్రతి కేంద్రంలో కాంటాలను, మిల్లుల్లోని వేబ్రిడ్జిలను తనిఖీ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కాగా సొసైటీ సెంటర్‌లో వేయింగ్ మిషన్ సమస్య ఉండటంతో తరుగు వచ్చిందని, మిషన్‌ను మరమ్మతు చేయించి ధాన్యం కొనుగోలు  చేస్తున్నామని సెంటర్ సిబ్బంది తెలిపారు.

సూర్యాపేట మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

 ఒక్కరోజే 40 వేల బస్తాల రాక

సూర్యాపేట, నవంబర్ 9 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో గల వ్యవ సాయ మార్కెట్‌కు శనివారం ధాన్యం పోటెత్తింది. ఒక్కరోజే 40 వేల బస్తాల ధాన్యాన్ని రైతులు మార్కెట్‌కు తీసుకురాగా క్వింటాలుకు రూ.2,400 లోపే ధర పలికింది. శనివారం తెల్లవారుజాము నుంచే ట్రాక్టర్‌లలో ధాన్యాన్ని రైతులు తరలించారు. ఈ సీజన్‌లో మార్కెట్ తరలివచ్చిన అత్యధిక ధాన్యంగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.