18-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం వద్ద సోమవారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనీ విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడకు వెళ్లి చూడగా అక్కడ ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా వారిని పట్టుకుని,వారి వద్ద నుండి 3338/- రూపాయలు, 4 సెల్ ఫోన్ లు, 2 బైకులు సీజ్ చేసి , వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి, పాల్వంచ మండల ప్రజలు ఎవరైనా పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.