15-04-2025 01:15:14 AM
దివిటిపల్లిలో ముగ్గురు, మోతి ఘనపూర్‌లో ఇద్దరు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లాలో సోమ వారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లిన ఐదుగురు మృతిచెందారు. మహబూబ్‌నగర్ మండల పరిధిలోని దివిటిపల్లిలో క్వారీలో ఈతకోసం వెళ్లిన ముగ్గురు మృతిచెందగా.. బాలానగర్ మండలం మోతి ఘ నపూర్ పెద్ద చెరువులో ఇద్దరు మృతిచెందారు.
మహబూబ్‌నగర్ మండలం దివి టిపల్లి డబుల్‌బెడ్‌రూం సమీపంలో ఉన్న క్వారీ లో సోమవారం మధ్యాహ్నం ఈత నేర్చుకునేందుకు విజయ్(32), ఎండీ మహమూద్ (30), అయ్యప్ప(16) వెళ్లారు. ముగ్గురికీ ఈత రాకపోవడంతో క్వారీలో ఒడ్డున ఉంటూ ఈత కొట్టారు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లి ఈత నేర్చుకునేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది.
దీంతో ముగ్గురూ నీటి లో మునిగి మృతిచెందారని పోలీసులు తెలిపారు. అలాగే.. బాలానగర్ మండలం మోతి ఘనపూర్ పెద్దచెరువులో గంగాధర్‌పల్లికి చెందిన శివకుమార్(46), యాదగిరి(౨౨) ఈతకు వెళ్లారు. చెరువులో ముళ్ల పొదలు ఉన్నాయని తెలియక శివకుమార్ లోపలికి వెళ్లి ఈత కొడుతుండగా ఆ ముళ్ల పొదల్లో చిక్కుకొనిపోయాడు.
బయటికి రాలేకపోవడంతో అతని కాపాడేందుకు యాదగిరి కూడా చెరువులోకి దిగే ప్రయ త్నం చేయగా అతను కూడా ముళ్ల పొదల్లో చిక్కుకుని ఇద్దరూ మునిగి మృతిచెందారు.