calender_icon.png 26 October, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ పేర్లతో మోసం... ఐదుగురు అరెస్ట్

01-09-2024 05:02:19 PM

నిర్మల్: క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ పేర్లతో ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు ముఠా సభలను ఆదివారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో గత ఆరు నెలల నుంచి ఐదుగురు ముఠా సభ్యులు అమాయక ప్రజల నుంచి తక్కువ డబ్బుకు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని గిఫ్ట్ కరెన్సీ బిట్ కాయిన్ ఆన్లైన్ లో పెట్టుబడులు పెట్టిస్తున్న ముఠాపై నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీ నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారి చల్ల రాజకుమార్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులైన కిరణ్, నరేష్, గంగాధర్, మహేష్ లను అదుపులో తీసుకొని విచారించగా నేరము ఒప్పుకున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్ తదితర ప్రాంతాల్లో 50 కోట్ల వ్యాపారం చేయడం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎవరైన ఇటువంటి మోసాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.